Wednesday, 13 November 2024

Periginadu Chudaro - Annamayya Keerthana Lyrics | పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు

Periginadu choodaro pedda hanumantudu
paragi nana vidyala balavantudu

Rakkasula paliki rana ranga soorudu
vekkasapu ekanga veerudu
dikkulaku sanjeevi techchina dheerudu
akkajamainatti akarudu

Lali meerinayatti lavula bheemudu
balu kapikula sarvabhoumudu
nelakonna lanka nirdhuma dhamudu
talapuna sriramunatma ramudu

Deva karyamula dikku varenyudu
bhavimpa gala tapah phala punyudu
sri venkatesWara sevagraganyudu
savadhanudu sarva saranyudu 


పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ।
పరగి నానా విద్యల బలవంతుడు ॥

రక్కసుల పాలికి రణరంగ శూరుడు
వెక్కసపు ఏకాంగ వీరుడు ।
దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు
అక్కజమైనట్టి ఆకారుడు ॥

లలిమీరిన యట్టి లావుల భీముడు
బలు కపికుల సార్వభౌముడు ।
నెలకొన్న లంకా నిర్థూమధాముడు
తలపున శ్రీరాము నాత్మారాముడు ॥

దేవకార్యముల దిక్కువరేణ్యుడు
భావింపగల తపః ఫల పుణ్యుడు ।
శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు
సావధానుడు సర్వశరణ్యుడు ॥

No comments:

Post a Comment